ఏపీలో ఇద్దరు జిల్లా పంచాయతి అధికారులకు జైలుశిక్ష విధించింది హైకోర్టు. జలవనరుల శాఖ స్థలంలో గ్రామ సచివాలయం నిర్మాణంపై గతంలో స్టే ఇచ్చింది హైకోర్టు. స్టే ఉన్నా ఈవో ఆర్‌డీ ద్వారా చెల్లింపులు చెయ్యడంతో సూమోటోగా కోర్టుధిక్కార కేసు నమోదుచేశారు. గతంలో కర్నూలు జిల్లా డీపీవో గా పనిచేసి ప్రస్తుతం అనంతపురంలో ఉన్న ప్రభాకరరావుకు వారం రోజులు జైలు శిక్ష, 2 వేలు జరిమానా విధించింది. చిత్తూరు జిల్లా పంచాయితీ అధికారి దశరధ రామిరెడ్డికి 15 రోజులు జైలు శిక్ష, 2 వేల జరిమానా విధించింది హైకోర్ట్. తీర్పు అమలును వారం రోజుల పాటు నిలిపివేస్తూ అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇచ్చింది హైకోర్టు.
Read Also: Vadivelu: స్టార్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం
ఇదిలా ఉంటే సలహాదారుల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. దేవాదాయశాఖ సలహాదారు శ్రీకాంత్ నియామకం, ఉద్యోగుల సలహాదారుడు చంద్రశేఖరరెడ్డి నియామకంపై విచారణ జరిగింది. నిష్ణాతులైన వారినే సలహాదారులుగా నియమిస్తున్నామన్నారు ఏజీ. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోయే ముందు సలహాదారుల అభిప్రాయం తీసుకుంటుందని కోర్టుకు తెలిసారు అడ్వకేట్ జనరల్. మెరిట్స్ పై వాదనలు వినిపిస్తామని హైకోర్టుకు తెలిపారు ఏజీ. ఉద్యోగుల టీఏ, డీఏ కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా అంది. ఈ సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమంది హైకోర్టు.
Read Also: Russia-Ukraine War: అదే జరిగితే అణుయుద్ధం తప్పుదు.. రష్యా మాజీ అధ్యక్షుడి హెచ్చరిక