Site icon NTV Telugu

Chandrababu Bail: నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ

Chandrababu

Chandrababu

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఉచిత ఇసుక విధానం కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. దీంట్లో భాగంగా ఈ పిటిషన్ సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ హైకోర్టులో రిప్లై వాదనలు వినిపించారు. కాగా, ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడానికి కారణా లేమిటో గత ప్రభుత్వం పేర్కొనలేదని ఆయన చెప్పారు. వేలం నిర్వహించకుండా ఇసుక రీచ్‌లను ఇతరులకు చంద్రబాబు సర్కార్ అప్పగించిందని ఏజీ తెలిపారు. ఇక, సహజ వనరులు దోపిడీకి గురయ్యాయని సీఐడీ తరపున వాదించిన అడ్వొకేట్ జనరల్ చెప్పారు. విచక్షణారహిత ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తప్పు పట్టిందని ఆయన పేర్కొన్నారు. ఎన్జీటీ ఉత్తర్వులను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ కేసుపై పూర్తి స్థాయి వాదనలు ఇవాళ కొనసాగనున్నాయి. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు హైకోర్టును కోరారు. ఇరు వాదనల తర్వా న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వనుందో చూడాలి.

Exit mobile version