Site icon NTV Telugu

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో బిగ్‌ రిలీఫ్..

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. బెజవాడ మాచవరం పోలీసులు వంశీపై హత్య యత్నం కేసు నమోదు చేశారు. నూతక్కి సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీ పై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. వంశీని అరెస్టు చేయవద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వెకేషన్ బెంచ్ చేపడుతుందని వాయిదా వేసింది.

READ MORE: 200MP కెమెరా, 6500mAh బ్యాటరీ.. ప్రత్యేక ఆకర్షణగా Oppo Reno 15 Pro Mini!

ఇదిలా ఉండగా.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారంటూ నూతక్కి సునీల్ అనే వ్యక్తి విజయవాడ మాచవరం పోలీసులకు ఈనెల 17న ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు కేసు ఫైల్ చేశారు. వంశీతో పాటు ఎనిమిది మందిపై హత్యాయత్నం సహా పలు కేసులు నమోదయ్యాయి. కేసు నమోదైన సంగతి తెలిసిన దగ్గర్నుంచి వంశీ ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. వంశీ తో పాటు కేసులో నిందితులుగా ఉన్న మిగతా వారు కూడా కనిపించడం లేదు. దీంతో.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరినీ అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కొన్ని టీమ్‌లు హైదరాబాద్‌లో గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి వంశీకి ఊరట లభించింది.

READ MORE: Iran Protests: “ఒక్కరు చనిపోయినా, అమెరికా రెడీగా ఉంది”.. ఇరాన్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్..

Exit mobile version