AP High Court: హెల్మెట్ ధరించాలనే నిబంధన అమలులో ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా మంది వాహనదారులు హెల్మెట్ ధరించట్లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. నిబంధనల అమలు చేయటంలో పోలీసులు విఫలమవుతున్నారని హైకోర్టు మండిపడింది. మోటారు వాహనచట్ట నిబంధనలు పాటించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసి పిల్‌పై ఉన్నత న్యాయస్థానం విచారించింది. ఎలక్ట్రానిక్ విజిలెన్స్ ఉండాలని న్యాయవాది వాదించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం 4 వారాలకు వాయిదా వేసింది.
Read Also: Reactor Explosion: మాటలకందని విషాదం.. ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో 14 మంది మృతి
