NTV Telugu Site icon

Ambati Rambabu Petition: మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ ను కొట్టేసిన ఏపీ హైకోర్టు..

New Project (6)

New Project (6)

మంత్రి అంబటి పిటిషన్‌ డిస్మిస్‌ చేసిన ఏపీ హైకోర్టు. సత్తెనపల్లిలో 4 పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ జరపాలని అంబటి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. చంద్రగిరిలో రీపోలింగ్‌ జరపాలంటూ మోహిత్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను కూడా కోర్టు డిస్మిస్‌ చేసింది. కాగా.. పల్నాడు జిల్లాలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ రోజున అల్లర్లు, అరాచకాలు చెలరేగాయి. అయితే, ఈ భయాందోళనలకు పెద్ద ఎత్తున అవకతవకలు జరగడాన్ని మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. సత్తెనపల్లి నియోజక వర్గంలోని 236, 237, 253, 254 వార్డుల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తన నియోజకవర్గంలో తాజాగా ఎన్నికలు నిర్వహించాలని అంబటి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు (గురువారం) విచారణ చేపట్టింది.

READ MORE: SIT Investigation: దాడి ఘటనపై విచారణకు హాజరైన పులివర్తి నాని..అధికారులతో ఏం చెప్పారంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌కు ముందు నుంచే పల్నాడు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఎన్నికల తర్వాత కూడా రెండు రోజులపాటు టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న పరిస్థితి జిల్లాలో కనిపించింది. కొందరు నేతలు, కార్యకర్తలకు రిగ్గింగ్‌లకు పాల్పడ్డారని మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో రీ పోలింగ్‌ జరపాలని మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని 236, 237, 253, 254 పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.