Site icon NTV Telugu

AP High Court: ఎస్సై పోస్టుల నియామకం కేసు.. పిటిషనర్లపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Ap High Court

Ap High Court

AP High Court: ఎస్సై పోస్టుల నియామకంలో అన్యాయం జరిగిందని తప్పు పిటిషన్ దాఖలు వేసిన పిటిషనర్లపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లు ప్రభుత్వ ఆసుపత్రిని శుభ్రం చేసి సామాజిక సేవ చేసేలా ఆదేశాలు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. వచ్చే సోమవారం పూర్తి ఆదేశాలు ఇస్తామని హైకోర్టు వాయిదా వేసింది. ఎత్తు సరిగా కొలవనీ కారణంగా అన్యాయం జరిగిందని దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.

Read Also: MLC Sheikh Sabji: ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపట్ల కుటుంబసభ్యుల అనుమానాలు

గత విచారణ సమయంలో కోర్టు ప్రాంగణంలో ఎత్తు కొలువగా పిటిషనర్లు తప్పుడు వివరాలు ఇచ్చినట్టు ఏపీ హైకోర్టు గుర్తించింది. కోర్టును మోసం చేయాలని అనుకున్నారా అని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. ఎత్తు మేమే కొలుస్తామని చెప్పినా డాక్టర్ సర్టిఫికెట్లు ఎలా తెచ్చారని కోర్టు ప్రశ్నించింది. మీ ఉద్దేశం ఏంటో అర్థం అవుతుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం పేర్కొంది. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు చేపట్టే వారికి ఇది ఒక హెచ్చరికలా ఉండాలని హైకోర్టు వెల్లడించింది. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్న, తప్పుడు ఉద్దేశాలతో పిటిషనర్ ఉన్నారని కోర్టు మండిపడింది.

Read Also: Perni Nani: చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లపై పేర్ని నాని ఫైర్

పిటిషనర్లు పేదలని వారికి శిక్ష వేయవద్దని, తన సలహా మేరకు మాత్రమే డాక్టర్ సర్టిఫికెట్లు తెచ్చారని కోర్టుకు పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ కుమార్ తెలిపారు. కోర్టును క్షమాపణ కోరారు పిటిషనర్ న్యాయవాది శ్రావణ కుమార్. యాంత్రికంగా సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్న డాక్టర్లకు మార్గ దర్శకాలు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version