Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది.. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.. ఈ కేసులో 500 పేజీల కౌంటర్‌ను సీఐడీ దాఖలు చేసింది.. వచ్చే గురువారానికి ఈ కేసు విచారణ వాయిదా వేయాలని సీఐడీ వాదించింది.. కానీ, చంద్రబాబు తరపు లాయర్లు బుధవారమే విచారణ చేపట్టాలని కోరడంతో.. హైకోర్టు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
Read Also: Israel Hamas War: గాజా స్వాధీనానికి బయలు దేరిన ఇజ్రాయెల్.. గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధం
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
మరోవైపు.. అమరావతి రాజధాని అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్లపై విచారణ రీఓపెన్ చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.. ఇక, అసైన్డ్ ల్యాండ్ కేసులో సీఐడీ అధికారులు ఇచ్చిన కొత్త ఆధారాలను హైకోర్టు పరిశీలించింది. కేసు రీఓపెన్ చేయడంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే.. నేటికి చంద్రబాబు రిమాండ్ 38వ రోజుకు చేరింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత నెల 9వ తేదీన చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఇక, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తాజా హెల్త్ బులిటెన్ లో జైలు అధికారులు పేర్కొన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్‌కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!