NTV Telugu Site icon

Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu

Chandrababu

Chandrababu: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్ఆర్) కేసు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా పడింది.. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.. ఈ కేసులో 500 పేజీల కౌంటర్‌ను సీఐడీ దాఖలు చేసింది.. వచ్చే గురువారానికి ఈ కేసు విచారణ వాయిదా వేయాలని సీఐడీ వాదించింది.. కానీ, చంద్రబాబు తరపు లాయర్లు బుధవారమే విచారణ చేపట్టాలని కోరడంతో.. హైకోర్టు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

Read Also: Israel Hamas War: గాజా స్వాధీనానికి బయలు దేరిన ఇజ్రాయెల్.. గ్రౌండ్ ఆపరేషన్‎కు సిద్ధం

మరోవైపు.. అమరావతి రాజధాని అసైన్డ్‌ భూముల కేసులో చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ క్వాష్‌ పిటిషన్లపై విచారణ రీఓపెన్‌ చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను నవంబర్‌ 1వ తేదీకి వాయిదా వేసింది.. ఇక, అసైన్డ్‌ ల్యాండ్‌ కేసులో సీఐడీ అధికారులు ఇచ్చిన కొత్త ఆధారాలను హైకోర్టు పరిశీలించింది. కేసు రీఓపెన్‌ చేయడంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే.. నేటికి చంద్రబాబు రిమాండ్‌ 38వ రోజుకు చేరింది. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో గత నెల 9వ తేదీన చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఇక, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తాజా హెల్త్ బులిటెన్ లో జైలు అధికారులు పేర్కొన్న విషయం విదితమే.