Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Govt Took A Decision For That Students

AP GOVT : ఆ పాఠశాల విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది

Published Date :July 11, 2023 , 11:52 am
By Murali Krishna
AP GOVT : ఆ పాఠశాల విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల పై జగన్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఒక కొత్త వ్యవస్ధను అందుబాటులోకి తీసుకురాబోతుంది.ఇంతకు ఆ సమస్య ఏమిటంటే. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం పాఠశాలల్లో కొన్ని ఎకోపాధ్యాయ పాఠశాలలు అలాగే కొన్ని ఇద్దరు ఉపాధ్యాయులు వున్న పాఠశాలలు ఉన్నాయి.ఇలాంటి పాఠశాలలో ఉపాధ్యాయులు సెలవు పెడితే ఆ రోజుకి పాఠశాల మూసివేసే పరిస్థితి ఏర్పడుతుంది.పాఠశాల మూసి వేయడం వలన విద్యార్ధుల చదువుకు ఆటంకం కలుగుతుంది.ఎప్పుడో ఒకరోజు అయితే ఫర్వాలేదు కానీ రోజుల తరబడి సెలవుల్లో ఉంటే ఆ ప్రభావం విద్యార్థుల చదువులపై తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులపై గతంలో పోలిస్తే ఇప్పుడు ఒత్తిడి బాగా పెరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు విద్యాసంస్కరణలు అలాగే మధ్యాహ్న భోజనం, ఇతర కార్యక్రమాల కారణంగా ఉపాధ్యాయులు కొంత ఒత్తిడికి గురవుతున్నారు.

మామూలు పాఠశాలలో ఉపాధ్యాయుడు సెలవు పెడితే మరో ఉపాధ్యాయుడుతో నడిపించవచ్చు. కానీ ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలో ఉపాధ్యాయుడు సెలవులు పెట్టడం వలన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.. దీంతో ఉన్నతాధికారులు ఆయా ఉపాధ్యాయులకు సెలవులను నిరాకరిస్తున్నారు. దీంతో వారు చెప్పకుండానే సెలవు పెట్టడం లేదా స్కూలుకు వచ్చినట్లే వచ్చి మధ్యలోనే వెళ్లిపోవడం వంటి పనులు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ అనే వ్యవస్ధ గతంలోనే వున్న విషయం తెలిసిందే. అయితే ఆ వ్యవస్థ పూర్తిస్ధాయిలో అమలు కావడం లేదు. దీంతో ఇప్పటికే ఉన్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ను క్లస్టర్ మొబైల్ రిజర్వ్ టీచర్లుగా మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి తమ పరిధిలో ఉన్న కనీసం మూడు నుంచి నాలుగు స్కూళ్లను అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.వారి పరిధిలో  ఎక్కడ ఉపాధ్యాయుడు సెలవు పెట్టినా వీరు ఆయా పాఠశాలకు వెళ్లి బోధన కొనసాగించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో ను కూడా విడుదల చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #clusterd resource person
  • ap govt
  • Government schools

తాజావార్తలు

  • DGCA: విమానయాన సంస్థలకు DGCA కీలక సూచనలు.. 11 దేశాల గగనతలాలను ఉపయోగించొద్దని సలహా జారీ

  • India vs Ireland T20I Series: ఐపీఎల్ 2026 సన్నాహాల మధ్య టీమిండియా కొత్త టీ20 సిరీస్‌ ప్రకటన.. మ్యాచ్ లు జరిగేది అక్కడే..!

  • Heat Stroke Warning Signs: వడదెబ్బ సంకేతాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..

  • Galaxy A-series: సామ్ సంగ్ లవర్స్ గెట్ రెడీ.. కొత్త స్మార్ట్‌ఫోన్‌లు గెలాక్సీ A37, A57 మార్చి 25న రిలీజ్ కు రెడీ..

  • Dhurandhar 2: తెలుగు వెర్షన్ కోసం ఎదురు చూసేవారికి గుడ్ న్యూస్

ట్రెండింగ్‌

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions