NTV Telugu Site icon

AP GOVT : ఆ పాఠశాల విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది

Whatsapp Image 2023 07 11 At 11.46.07 Am

Whatsapp Image 2023 07 11 At 11.46.07 Am

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల పై జగన్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఒక కొత్త వ్యవస్ధను అందుబాటులోకి తీసుకురాబోతుంది.ఇంతకు ఆ సమస్య ఏమిటంటే. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం పాఠశాలల్లో కొన్ని ఎకోపాధ్యాయ పాఠశాలలు అలాగే కొన్ని ఇద్దరు ఉపాధ్యాయులు వున్న పాఠశాలలు ఉన్నాయి.ఇలాంటి పాఠశాలలో ఉపాధ్యాయులు సెలవు పెడితే ఆ రోజుకి పాఠశాల మూసివేసే పరిస్థితి ఏర్పడుతుంది.పాఠశాల మూసి వేయడం వలన విద్యార్ధుల చదువుకు ఆటంకం కలుగుతుంది.ఎప్పుడో ఒకరోజు అయితే ఫర్వాలేదు కానీ రోజుల తరబడి సెలవుల్లో ఉంటే ఆ ప్రభావం విద్యార్థుల చదువులపై తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులపై గతంలో పోలిస్తే ఇప్పుడు ఒత్తిడి బాగా పెరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు విద్యాసంస్కరణలు అలాగే మధ్యాహ్న భోజనం, ఇతర కార్యక్రమాల కారణంగా ఉపాధ్యాయులు కొంత ఒత్తిడికి గురవుతున్నారు.

మామూలు పాఠశాలలో ఉపాధ్యాయుడు సెలవు పెడితే మరో ఉపాధ్యాయుడుతో నడిపించవచ్చు. కానీ ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలో ఉపాధ్యాయుడు సెలవులు పెట్టడం వలన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.. దీంతో ఉన్నతాధికారులు ఆయా ఉపాధ్యాయులకు సెలవులను నిరాకరిస్తున్నారు. దీంతో వారు చెప్పకుండానే సెలవు పెట్టడం లేదా స్కూలుకు వచ్చినట్లే వచ్చి మధ్యలోనే వెళ్లిపోవడం వంటి పనులు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ అనే వ్యవస్ధ గతంలోనే వున్న విషయం తెలిసిందే. అయితే ఆ వ్యవస్థ పూర్తిస్ధాయిలో అమలు కావడం లేదు. దీంతో ఇప్పటికే ఉన్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ను క్లస్టర్ మొబైల్ రిజర్వ్ టీచర్లుగా మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి తమ పరిధిలో ఉన్న కనీసం మూడు నుంచి నాలుగు స్కూళ్లను అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.వారి పరిధిలో  ఎక్కడ ఉపాధ్యాయుడు సెలవు పెట్టినా వీరు ఆయా పాఠశాలకు వెళ్లి బోధన కొనసాగించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో ను కూడా విడుదల చేసింది.

Show comments