Family Benefit Card in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ‘ఫామిలీ బెనిఫిట్ కార్డ్’ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ కార్డ్ తరహాలోనే బెనిఫిట్ కార్డ్ ఉండనుంది. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్కీంలు సహా అన్ని వివరాలను ఫ్యామిలీ కార్డులో పొందుపరచనుంది. ప్రభుత్వం త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సమీక్షలో సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
Also Read: Daniil Medvedev: ప్రేక్షకులతో అనుచిత ప్రవర్తన.. స్టార్ ఆటగాడికి 37 లక్షలు జరిమానా!
‘ఏయే కుటుంబానికి ఏమేం అవసరాలున్నాయోననే అంశాన్ని క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తీసుకోవాలి. ప్రభుత్వ సంక్షేమం అవసరమైన వారికి వెంటనే అందేలా వ్యవస్థను సిద్దం చేయాలి. ప్రతి కుటుంబానికి ఇచ్చే ఫ్యామిలీ కార్డులో ప్రభుత్వం ఇచ్చే స్కీంల వివరాలను పొందుపరచండి. ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డును ఉపయోగించుకోవాలి. కార్డులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకు రావాలి. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదు. అందరికీ లబ్ది కలిగేలా అవసరమైతే స్కీంలను రీ-డిజైన్ చేసే అంశాన్నీ పరిశీలిద్దాం’ అని సమీక్ష అధికారులతో సీఎం చంద్రబాబు అన్నారు.
