Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, తెలుగు ప్రజల సంస్కృతికి ఎంతో భావోద్వేగమైన అనుబంధం ఉన్న ‘నంది ఫిల్మ్ అవార్డుల’ పండగ మళ్లీ రాబోతోంది. గత ఏడేళ్లుగా (2017-2024) నిలిచిపోయిన ఈ ప్రతిష్టాత్మక అవార్డులను తిరిగి పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్లో సర్వత్రా సంతోషాన్ని నింపుతోంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. గత నెల (24.09.2026) నిర్మాతల మండలి.. ఏపీ ఎఫ్డీసీ (AP FDC) ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ సమర్పించింది. ఆ లేఖలో పేర్కొన్న అభ్యర్థనను ప్రభుత్వం వెంటనే పరిశీలించి, బంగారు నంది, వెండి నంది, కాంస్య నంది (Golden, Silver & Bronze Nandi) అనే మూడు కేటగిరీలలో నంది అవార్డులను పునరుద్ధరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. 1964 నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ఈ అవార్డుల ద్వారా కళాకారులను, సాంకేతిక నిపుణులను సత్కరించడం అనేది మన సంస్కృతిని గౌరవించడమేనని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పేర్కొంది.
కేవలం నంది అవార్డులే కాకుండా.. 2017-2024 సంవత్సరాలకు గాను ‘ఎన్.టి.ఆర్. జాతీయ ఫిల్మ్ అవార్డు’ను కూడా పునరుద్ధరించడంపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించడం పట్ల కౌన్సిల్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా.. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కె. దుర్గేష్, హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ఏపీ రాష్ట్ర ఫిల్మ్, టీవీ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పి. భరత్ భూషణ్, మరియు మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్‌లకు కౌన్సిల్ ప్రెసిడెంట్ సి. కళ్యాణ్, గౌరవ కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్, వై.వి.ఎస్. చౌదరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
మన సంస్కృతిని గౌరవిస్తే ప్రకృతి రక్షిస్తుందని, అది తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడుతుందని కౌన్సిల్ అభిప్రాయపడింది. కావున తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రతిభావంతులను, సాంకేతిక నిపుణులను ఇదే విధంగా గౌరవించాలని కూటమి ప్రభుత్వాన్ని వారు అభ్యర్థించారు. మొత్తానికి ఏడేళ్లుగా అటకెక్కిన నంది అవార్డుల సందడి త్వరలోనే మళ్లీ మొదలుకానుండటంతో టాలీవుడ్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!