Site icon NTV Telugu

DSC Results: డీఎస్సీ ఫలితాల విడుదల.. భర్తీకానున్న 16,347 ఉపాధ్యాయ పోస్టులు!

Dsc Results

Dsc Results

DSC Results: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి మెగా డీఎస్సీ 2025 నిర్వహించింది. అభ్యర్థుల నుండి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆ తర్వాత సవరించిన తుది ‘కీ’ ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా రూపొందించిన డీఎస్సీ తుది ఫలితాలను విడుదల చేసింది ప్రభుత్వం. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in ద్వారా తుది ఫలితాలను, స్కోర్ కార్డులను పొందవచ్చని ప్రకటించింది.

Komatireddy Venkat Reddy : కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇక టెట్ వివరాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అభ్యర్థులు సంబంధిత https://apdsc.apcfss.in వెబ్సైట్ లో చూడచ్చని సూచించింది సర్కార్. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా టెట్ వివరాలు సరిచేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ అవకాశం రెండు రోజులు మాత్రమే ఉంటుందని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి వెల్లడించారు.

Modi Zelensky phone call: జెలెన్ స్కీతో మోడీ ఫోన్ కాల్.. ఏం చర్చించారంటే..!

Exit mobile version