Site icon NTV Telugu

AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల.. రేపటి నుంచి ఏపీలో 28 జిల్లాలు!

Ap New Districts

Ap New Districts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదలైంది. మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. రంపచోడవరం హెడ్ క్వాటర్‌గా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలానే మార్కాపురం హెడ్ క్వాటర్‌గా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. బుధవారం (డిసెంబర్ 31) నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి తీసుకువస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది.

2 కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. అన్నమయ్య జిల్లా హెడ్ క్వాటర్‌ను రాయచోటి నుంచి మదనపల్లికి మార్చుతూ తుది నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ.. అలానే పలు రెవెన్యూ డివిజన్లు, మండలాలు సరిహద్దులు మార్పులు చేస్తూ తుది నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. రేపటి నుంచే సరిహద్దుల మార్పులు అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

Also Read: Sara Arjun History: 20 ఏళ్లకే అరుదైన రికార్డ్.. ఏ హీరోయిన్‌కు దక్కని క్రెడిట్ సారా సొంతం!

నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్‌ నుంచి టెక్కలికి.. సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్‌ నుంచి పెద్దపురానికి మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రీస్ట్రక్చర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ కాగా.. పెనుగొండను వాసవీ పెనుగొడంగా మారుస్తూ తుది నోటిఫికేషన్‌ రిలీజ్ అయింది. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్‌ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కానుంది. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో మండలాలను మార్చుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేపటి నుంచి రెవెన్యూ డివిజన్ల మార్పులు, చేర్పులు అమల్లోకి రానున్నాయి.

ప్రస్తుతం 77 రెవెన్యూ డివిజన్‌లు ఉండగా.. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్‌లు జత అవుతున్నాయి. మొత్తంగా 82 రెవెన్యూ డివిజన్‌లు కానున్నాయి. అడ్డరోడ్డు జంక్షన్, పీలేరు, బనగానపల్లి, మడకశిర, అద్దంకిలు కొత్త రెవెన్యూ డివిజన్‌లు. 679 ఉన్న మండలాలు రేపటి నుంచి 681 మండలాలు కానున్నాయి. ఆదోని 1, ఆదోని 2 రెండు కొత్త మండలాలు.

Exit mobile version