NTV Telugu Site icon

AP Govt: పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్దరణ..

Ap Govt

Ap Govt

AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరు తొలగించి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్దరణ చేస్తున్నట్లు సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, పెన్షన్ల పెంపుపై జీవో జారీ చేశారు. ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతో ఏపీలో పెన్షన్ల స్కీం చంద్రబాబు సర్కార్ అమలు చేయనుంది. 3 వేల రూపాయలుగా ఉన్న పెన్షన్ను రూ. 4 వేలకు పెంచేశారు. అలాగే, వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్సకార, ఒంటరి మహిళ, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్ వంటి వారికి పెంచిన 4 వేల రూపాయల పెన్షన్ అందించనున్నారు.

Read Also: Siddipet Schools: సర్కారు బడి ముందు నో అడ్మిషన్ బోర్డు.. కారణం ఇదీ..

అలాగే, దివ్యాంగులకు 3 వేల నుంచి 6 వేల రూపాయలకు పెంచుతున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం పేర్కొనింది. పూర్తి స్థాయి దివ్యాంగులకు ఇచ్చే 5 వేల నుంచి 15 వేల రూపాయలకు పెంచినట్లు ఏపీ సర్కార్ తెలిపింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వారికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెన్షన్ పెంపు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులను జారీ చేశారు. పెంచిన పెన్షన్ తొందరలోనే అందిస్తామని వెల్లడించారు.