రుషికొండ టూరిజం రిసార్ట్‌లకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, డోల బాలవీరంజనేయస్వామి సభ్యులుగా కమిటీ ఏర్పాటు అయింది. టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సమన్వయంతో ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. అవసరాన్ని బట్టి టూరిజం శాఖకు సంబంధించి కొంతమంది అధికారులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Pawan Kalyan: 21 ఏళ్ల వయసులోనే రాజకీయ ఆలోచనలు వచ్చాయి.. కమ్యూనిజం చదివాను!
గత కొన్ని రోజులుగా రుషికొండ రిసార్ట్‌లను ఏ రకంగా ఉపయోగించాలనే చర్చ జరుగుతోంది. ఈరోజు ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రుషికొండను సందర్శించారు. అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చిస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అవసరమైతే కొంతమందిని ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా కమిటీ నియామకం చేస్తుంది. మొత్తానికి డిప్యూటీ సీఎం పవన్ రుషికొండ రిసార్ట్ పర్యటన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు అవ్వడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రుషికొండపై ఏపీ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
