NTV Telugu Site icon

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఏపీ సర్కారు ఎక్స్‌గ్రేషియా..

Ap Govt

Ap Govt

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షలు అందించనుండగా.. గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వనుంది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర ప్రకటించిన సాయానికి అదనంగా ఏపీ ప్రభుత్వం ఈ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రైలు ప్రమాదంలో మరణించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తి(60) కుటుంబానికి ఏపీ సర్కారు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బాలాసోర్‌లో గురుమూర్తి నివాసం ఉంటుండగా.. ఏపీలో పెన్షన్ తీసుకుని వెళుతుండగా.. రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు గుర్తించింది. రైలు ప్రమాద బాధితులకు అండగా నిలుస్తున్నామని, ఏపీకి చెందిన ప్రయాణికులను గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన ప్రయాణికులు కూడా ఉండటంతో రాష్ట్ర చర్యలు చేపడుతోంది. ఏపీ ప్రయాణికులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఇక్కడ నుంచి అధికారులను ఒడిశాలో ప్రమాదం జరిగి ప్రాంతానికి పంపించింది. ప్రయాణికుల కుటుంబసభ్యుల కోసం ఏపీ ప్రభుత్వ వాట్సప్ నెంబర్‌ను తీసుకొచ్చింది. ట్రైన్ ప్రమాదంలో మీ కుటుంసభ్యులు మిస్ అయినట్లేతే 8333905022 వాట్సప్ నెంబర్‌ను సంప్రదించాలని కోరుతోంది. లాగే 1070, 112, 18004250101 హెల్ప్ నెంబర్లను కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

Read Also: Ashwini Vaishnav: రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు..

ఏపీ నుంచి మంత్రి అమర్‌నాథ్ నేతృత్వంలోని ముగ్గురు ఐఏఎస్ అధికారుల బృందం ఒడిశాలోని బాలాసోర్‌కు చేరుకుంది. ఏపీకి చెందిన ప్రయాణికులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు 11 మంది ఆచూకీ లభించలేదని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. ఆన్‌రిజర్వ్‌డ్ బోగీల్లో ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి మృతి చెందాడని అమర్‌నాథ్ వెల్లడించారు. మిస్సింగ్ అయినవారి కోసం వెతుకులాట మొదలుపెడుతున్నామని, రాష్ట్రానికి చెందిన బాధితుల కోసం బాలాసోర్‌లో 16 అంబులెన్స్‌లు, భువనేశ్వర్‌లో 10, బాలాసోర్‌లో ఐదు మహాప్రస్థాన వాహనాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనపై మంత్రి బొత్స సత్యనారాయణ పలు వివరాలను వెల్లడించారు. మంత్రి అమర్‌నాథ్‌ బృందం ఏపీకి చెందిన వారి వివరాలు సేకరిస్తున్నారని.. జనరల్ బోగీలలో ఉన్న డేటా తీసుకోలేదని… హాస్పిటల్స్‌లో చూసిన తర్వాత పరిస్థితులు తెలుస్తాయన్నారు. సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. ప్రమాదంలో 290 మందికి పైగా మంది చనిపోయారని ఒడిశా ప్రభుత్వం ప్రకటించిందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఏపీకి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి చనిపోయారని ఆయన చెప్పారు,