NTV Telugu Site icon

Gunmens for Minister Son: మంత్రి వేణుగోపాల్ తనయుడికి గన్ మెన్

Venuson

Venuson

రాజు తలచుకుంటే ఏదైనా సాధ్యమే. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆర్డర్ వేస్తే ఇంకేముంది? ఓ మంత్రిగారి కొడుక్కి గన్ మెన్ల నియామకం గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తనయుడు నరేన్ కి గన్ మెన్ లను కేటాయించింది ప్రభుత్వం. వేణుగోపాల్ తనయుడు నరేన్ కి 1+1 గన్ మెన్ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తన తండ్రి మంత్రి హోదా లో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నందున ఆయన తరపున రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు తాను చూసుకుంటున్నానని తనకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు నరేన్.

Read Also: Sharad Pawar: అదాని, అంబానీలపై దాడి చేయడం కరెక్ట్ కాదు

రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి తరఫున గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు నరేన్. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనా కూడా చెల్లుబోయిన వేణుగోపాల్ కు జగన్ మంత్రి పదవిని కట్టబెట్టారు.2008 నుండి 2012 వరకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు.

Vens1

జెడ్పీ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. వైఎస్ జగన్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ఆర్‌సీపీలో చేరారు వేణుగోపాల్. 2014 ఎన్నికల్లో కాకినాడ రూరల్ అసెంబ్లీ స్థానం నుండి ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2019 ఎన్నికల్లో ఆయన రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాది తర్వాత జగన్ కేబినెట్లోకి వేణుగోపాల్ కు స్థానం దక్కింది. ప్రస్తుతం సీఎం జగన్ కి నమ్మకస్తుడిగా ఉన్న వేణుగోపాల్ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా మంత్రి కొడుక్కి గన్ మెన్లను కేటాయించడం పార్టీలోనూ చర్చకు దారితీస్తోంది.

Read Also: Post Office : పోస్టాఫీసులో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.2.5 లక్షల వడ్డీ