Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సంస్థలకు జరపాల్సిన భూ కేటాయింపుల పరిశీలనకు కేబినెట్ సబ్ కమిటీని సర్కారు ఏర్పాటు చేసింది. ఆరుగురు మంత్రులతో జీవోఎంను నియమించారు. ఈ కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యా రాణి, కందుల దుర్గేష్, టీజీ భరత్‌లు ఉన్నారు.
Read Also: CM Chandrababu: సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
కేబినెట్ సబ్ కమిటీ కన్వీనరుగా పురపాలక శాఖా కార్యదర్శి, ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయా శాఖల కార్యదర్శులు నియామకమయ్యారు. గతంలో జరిగిన కేటాయింపులను కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించనుంది. గతంలో కేటాయించిన భూమి వినియోగంపై అంచనా వేసి అవసరమైన మార్పులను కేబినెట్ సబ్ కమిటీ సూచించనుంది. ప్రపంచ స్థాయి సంస్థలను గుర్తించి అమరావతిలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారాన్ని అందించేలా కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు చేయనుంది.