AP Government: సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. ఇక, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు మాత్రం చాలా కేర్ తీసుకోవాలి.. లేకపోతే.. ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి కూడా రావొచ్చు.. ఇప్పుడు తిరుపతి GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ ఫొటోలుతో ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు సుభాష్… వాణిజ్య పన్నులశాఖ తిరుపతి ప్రాంతీయ ఆడిట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ (FAC)గా పనిచేస్తున్న ఎస్.సుభాష్ చంద్రబోస్.. రాజధాని అమరావతిపై ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్టులు పెట్టారు.
Read Also: Story Board: రిటైర్మెంట్ నుంచి మోడీని RSS కూడా మినహాయించిందా.. ?
రాజధానిలో శాఖమూరు, నీరుకొండ, కృష్ణాయపాలెంలో సీఆర్‌డీఏ రిజర్వాయర్లు నిర్మించనుందంటూ వచ్చిన ఓ వార్తను ట్యాగ్ చేస్తూ.. సుభాష్ చంద్రబోస్ అనే అధికారి ‘అమరావతి కోసం 3 రిజర్వాయర్లెందుకు? అమరావతినే ఒక రిజర్వాయర్‌గా కడితే పోలా? అసలే ఏడాదికి 3 పంటలు పండే నేల, రిజర్వాయర్ నీళ్లతో పుష్కలంగా ఉండదా’ అంటూ తన ఫేస్‌బుక్ అకౌంట్లో అత్యంత వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. అంతే కాకుండా ‘ఒకే ఒక్క వర్షం, అమరావతి జలమయం’ అంటూ మరో పోస్ట్ పెట్టారు. అమరావతి నీట మునిగిపోయిందని నమ్మించేందుకు నీరుకొండ -పెదపరిమి మధ్య నీట మునిగిన పంట పొలాల ఫొటోను పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు అమరావతిపై ద్వేషం పెంచేలా కామెంట్స్ చేస్తూ, పోస్టులు పెడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఫిర్యాదుతో విచారణ జరిపిన అనంతరం సుభాష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
