Site icon NTV Telugu

APPSC Group 1 and Group 2: గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ప్రణాళిక

Appsc

Appsc

APPSC Group 1 and Group 2: ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీల భర్తీపై కసరత్తు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయోననే సమాచారాన్ని ఏపీ సర్కార్‌ సేకరిస్తోంది.. ఇప్పటి వరకు గ్రూప్-1 కింద 140 పోస్టులు, గ్రూప్-2 కింద 1082 పోస్టులున్నట్టు గుర్తించారు సంబంధిత అధికారులు.. 12 శాఖల పరిధిలో గ్రూప్-1 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చింది. హెచ్‌వోడీలతో పాటు మరో 10 శాఖల పరిధిలో గ్రూప్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చారు.. అయితే, వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతోంది..

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

కాగా, అత్యున్నత సర్వీసులైన గ్రూప్‌–1, 2 పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతించింది. గతంలో ప్రకటించిన జాబ్‌ క్యాలండర్‌ కంటే అధికంగా పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించిన విషయం విదితమే.. గ్రూప్‌–1లో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ, ఆర్టీవో, సీటీవో, మున్సిపల్‌ కమిషనర్లు, డీఎఫ్‌వో, ఎంపీడీవో వంటి పోస్టులు ఉండగా, గ్రూప్‌–2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి.

 

Exit mobile version