హిట్ ఫ్రాంచైజ్‌లో భాగంగా వస్తున్న మూడో చిత్రం హిట్ 3. ఈ సిరీస్‌లో మొదటి రెండు చిత్రాలు (హిట్: ది ఫస్ట్ కేస్, హిట్: ది సెకండ్ కేస్) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా థర్డ్ ఎడిషన్ మే ఒకటవ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో మరోసారి చర్చ ఊపందుకుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రాబోయే చిత్రం హిట్ 3 కోసం టికెట్ ధరలను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
Also Read:AFMS: ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ లో 400 మెడికల్ ఆఫీసర్ జాబ్స్.. అర్హులు వీరే
ఈ సినిమా కోసం రూ.50 నుంచి రూ.75 వరకు టికెట్ ధరలను పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుందని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి ప్రమోషనల్ కంటెంట్ కారణంగా హిట్ 3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మే 1, 2025న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ ఓపెనింగ్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ వారం ముందుగానే జోరందుకోవడం, ఈ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని తెలియజేస్తోంది.
Also Read:Harish Rao: కేసీఆర్ సభపై ప్రజల కంటే కాంగ్రెస్ నాయకులకు ఇంట్రెస్ట్ పెరిగింది..
ఇక ప్రస్తుతం ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలు రూ.110 నుంచి రూ.145 వరకు, మల్టీప్లెక్స్‌లలో రూ.177 వరకు ఉన్నాయి. అయితే, హిట్ 3 వంటి భారీ అంచనాలున్న చిత్రాల కోసం ధరలను రూ.50 నుంచి రూ.75 వరకు పెంచితే, థియేటర్ యజమానులు, నిర్మాతలు ఆర్థికంగా లాభపడతారని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.