Amaravati Land Pooling: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైంది ప్రభుత్వం.. దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. మొత్తం ఏడు గ్రామాల్లో భూములను సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు. 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. రాజధాని పరిధిలోని అమరావతి మరియు తుళ్లూరు మండలాల్లో మొత్తం 16,666.57 ఎకరాల భూమిని రెండో విడతలో సమీకరించనున్నారు. ఇందులో పట్టా భూములు 16,562.52 ఎకరాలు కాగా.. అసైన్డ్ భూములు 104.01 ఎకరాలుగా ఉన్నాయి..
Read Also: Metro Struked in Subway: సబ్వే కింద సడెన్‌గా ఆగిపోయిన మెట్రో.. భయపడిపోయన ప్రయణికులు
ఇక, అదనంగా, ఈ భూ సమీకరణ తర్వాత 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులోకి రానుంది. మొత్తంగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ తర్వాత 20,494 ఎకరాలు రాజధాని అభివృద్ధికి సిద్ధం కానున్నాయి.
అమరావతి మండలం భూముల వివరాలు (7,465 ఎకరాలు)
వైకుంఠపురం – 1,965 ఎకరాలు
పెద్దమద్దూరు- 1,018 ఎకరాలు
ఏంద్రాయి- 1,879 ఎకరాలు, 46 ఎకరాలు అసైన్డ్ భూమి
కర్లపూడి లేమల్లే- 2,603 ఎకరాలు, 51 ఎకరాల ఎసైన్డ్ భూమి
తుళ్లూరు మండలం భూముల వివరాలు (9,097 ఎకరాలు)
వడ్లమాను – 1,763.29 ఎకరాలు, అసైన్డ్ భూమి 4.72 ఎకరాలు..
హరిశ్చంద్రాపురం – 1,448.09 ఎకరాలు, అసైన్డ్ భూమి 2.29 ఎకరాలు
పెద్దపరిమి – 5,886.18 ఎకరాలు.. సీఆర్డీఏ బాధ్యతల్లోకి ల్యాండ్ పూలింగ్ చేయనున్నారు..
భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు తదుపరి దశలకు సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండో విడత భూ సమీకరణతో అమరావతి అభివృద్ధి కార్యక్రమానికి కొత్త ఊపిరి చేకూరనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మొదటి విడతలో భూములను సమీకరించిన నేపథ్యంలో, రెండో విడత పూర్తి అయితే అమరావతి మౌలిక వసతుల నిర్మాణానికి పెద్ద ఎత్తున భూములు అందుబాటులోకి రానున్నాయి.