Site icon NTV Telugu

AP Pensions: రేపటి నుంచి పెన్షన్ల పంపిణీకి సిద్ధమవుతున్న ఏపీ సర్కార్..

Ap Penshions

Ap Penshions

రేపటి నుంచి పెన్షన్ల పంపిణీకి ఏపీ సర్కార్ సిద్ధమవుతుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీకి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.. రేపు ఉదయం నుంచి గ్రామ సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. కాగా.. వృద్ధులు, వికలాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్ 6 లోపు పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Delhi: ఢిల్లీలో ఘోరం.. ఇద్దరు బాలికలు సజీవదహనం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీ విషయంలో గత రెండ్రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దని.. ఎన్నికల విధుల నుంచి కూడా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన పెన్షన్ల పంపిణీ చేసే అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ విషయంలో జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలను ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని సెక్రటరీల ద్వారా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయొచ్చని పలువురు జిల్లాల కలెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read Also: Keerthi Suresh : బంఫర్ ఆఫర్ కొట్టేసిన కీర్తి సురేష్.. పాన్ ఇండియా స్టార్ సినిమాలో ఛాన్స్..?

అంతకుముందు.. వాలంటీర్లతో పెన్షన్లు సహా ఇతర సామాజిక పథకాలేవీ పంపిణీ చేయించవద్దని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో.. దీనికి కారణం మీరంటే మీరంటూ అధికార, విపక్షాలు ఆరోపణలు చేసుకున్నాయి. కాగా.. తాజా నిర్ణయంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలకు ఫుల్ స్టాప్ పడనుంది.

Exit mobile version