Site icon NTV Telugu

AP Govt: ఏపీ సర్కార్ ముందడుగు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్..

Jagananna Vidya Deevana

Jagananna Vidya Deevana

విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ చేర్చనుంది. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు IB భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేయనుంది. అందుకు రేపు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం జరుగనుంది. రేపు ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ విద్యా బోర్డుతో రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) ఒప్పందం చేసుకోనుంది.

Read Also: Sundeep Kishan: కుమారి ఆంటీపై కేసు నమోదు.. చాలా అన్యాయం

కాగా.. 2025 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ లో విద్యా బోధన ప్రారంభం కానుంది. 2025 జూన్ లో ఒకటవ తరగతికి, జూన్ 2026 నుండి రెండో తరగతికి IB సెలబస్ ప్రకారం విద్యాబోధన జరగనుంది. క్రమంగా ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి పెంచుతూ 2035 నాటికి 10వ తరగతికి ఐబీ సిలబస్ తయారు చేయనున్నారు. 2037 నాటికి 12వ తరగతికి విద్యార్థులకు ఐబీ, రాష్ట్ర బోర్డుల జాయింట్ సర్టిఫికేషన్ ఇవ్వనుంది.

Pakistan: పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. ఇమ్రాన్‌ ఖాన్ పార్టీకి చెందిన ముగ్గురు మృతి

Exit mobile version