Site icon NTV Telugu

Andhra Pradesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం.. పెరిగిన వయోపరిమితి

Ap Govt

Ap Govt

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే వివిధ పోస్టుల భర్తీకి పలు నోటిఫికేషన్లు జారీ చేసింది.. కొన్ని పోస్టులను భర్తీ కూడా చేశారు.. అయితే, ఇప్పుడు నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్‌.. ఇక తమకు ఏజ్‌ పెరిగిపోతోంది.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇక పోటీపడలేం.. పరీక్షలు రాయలేం అనే టెన్షన్‌ లేకుండా.. వారికి మరింత వెసులుబాటు కల్పించింది.. నిరుద్యో­గులకు మేలు చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం..

Read Also: Pro Kabaddi 2023: చరిత్ర సృష్టించిన పవన్‌.. తెలుగు జట్టు తరఫున బరిలోకి!

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్సీ), ఇతర రిక్రూట్‌మెంట్‌ ఏజె­న్సీలు నేరుగా భర్తీ చేసే నాన్‌ యూనిఫాం పోస్టులు, యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.. నాన్‌ యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయో­పరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఇక, యూనిఫాం పోస్టులకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి అదనంగా రెండేళ్లు పెంచేసింది.. వచ్చే 2024 సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ఈ వయస్సు సడలింపు వర్తించనుంది.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ వివరాలను పేర్కొన్నారు. మొత్తంగా.. నిరుద్యోగుకు ఇది శుభవార్తగానే చెప్పుకోవాలి..

Exit mobile version