NTV Telugu Site icon

Jogi Naidu : నటుడు జోగినాయుడుకి కీలక పదవి

Jogi Naidu

Jogi Naidu

ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా ఎల్. జోగినాయుడు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎల్. జోగి నాయుడును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. జోగినాయుడు నియామకానికి సంబంధించి ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ విజయవాడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తదుపరి చర్యలు చేపట్టనున్నారు. జోగి నాయుడు 1998 లో జెమిని టీవీలో ప్రసారమైన జోగి బ్రదర్స్ అనే కార్యక్రమంతో పేరు తెచ్చుకున్నాడు. ఈ కార్యక్రమంలో మరో వ్యాఖ్యాత కృష్ణంరాజుతో కలిసి సినిమాల గురించి ఉత్తరాంధ్ర యాసతో మాట్లాడుతూ సమీక్షించేవారు. దర్శకుడు అవుదామని హైదరాబాదుకు వచ్చిన జోగి నాయుడు టీవీ రంగంలో ప్రవేశించాడు. కొద్ది రోజులు పూరీ జగన్నాథ్, కృష్ణవంశీతో కలిసి పనిచేశాడు.

Also Read : Nikki Yadav Case: రెండో పెళ్లి వద్దన్నందుకే హత్య.. అంతకు ముందే నిక్కీ-సాహిల్ పెళ్లి

ఇదిలా ఉంటే… గత సంవత్సరం నవంబర్‌లో నటుడు పోసాని కృష్ణమురళికి కీలక పదవిని కట్టబెట్టారు. పోసాని కృష్ణమురళీని ఏపీ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. పోసాని కృష్ణ మురళి గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ పార్టీలోనే ఉంటున్నారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారం కూడా చేశారు పోసాని. ఇక మరోవైపు వీలున్నప్పుడల్లా పోసాని జనసేన పార్టీ పై, అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడం వంటివి తెలిసిందే.

Also Read : Nikki Yadav Case: రెండో పెళ్లి వద్దన్నందుకే హత్య.. అంతకు ముందే నిక్కీ-సాహిల్ పెళ్లి

Show comments