Andhra Pradesh: ఏపీలో నార్కోటిక్ డ్రగ్స్ నియంత్రణ, నిర్మూలన, అక్రమ మద్యం నివారణ, డ్రగ్స్, మద్యం బాధితుల పునరావాసంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోమ్, మానవ వనరుల, ఎక్సైజ్, గిరిజన సంక్షేమం, వైద్యారోగ్య శాఖ మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి రవాణా, నిర్మూలన, నియంత్రణపై అధ్యయనం చేయాలని కమిటీకి ఆదేశాలు జారీ అయ్యాయి. డ్రగ్స్, గంజాయి, మద్యం బానిసైన వారికి డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటన్నింటిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Read Also: CM Chandrababu: రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష