NTV Telugu Site icon

Veligonda Project: చరిత్ర సృష్టించిన ఏపీ సర్కార్‌.. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలు పూర్తి..!

Veligonda Project

Veligonda Project

Veligonda Project: ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. వెలిగొండ కల సాకారం చేస్తూ.. రెండో టన్నెల్ పూర్తి చేసింది.. రెండో సొరంగం తవ్వకం పనులు ఇవాళ్టితో ముగిసాయి.. 2019, మే 30 నాటికి మిగిలిపోయిన 7.698 కిలోమీటర్ల తవ్వకం పనులు ఈ రోజు పూర్తి చేసినట్టు ఇంజీనీర్లు ప్రకటించారు.. ఇక, మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేసింది ప్రభుత్వం.. రెండో టన్నెల్‌ పనులు ఈ రోజు పూర్తి కావడంతో.. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ఘనత సొంతం చేసుకుంది..

Read Also: Vasantha Krishna Prasad: వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు.. నా భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది..!

ఇక, దుర్భిక్ష ప్రాంతా రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది ఏపీ ప్రభుత్వం .. శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీటిని తరలించడానికి ఫీడర్‌ ఛానల్‌ ఇప్పటికే పూర్తి చేశారు.. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పూర్తి చేశారు.. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరగానే నల్లమల సాగర్‌కు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు.. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు చేపట్టారు.. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని దాదాపు 4.47 లక్షల ఎకరాలు సాగునీటి సరఫరాకు మార్గం సుగమం అయినట్టు అవుతుది.. మూడు జిల్లాల పరిధిలోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది..

Read Also: Ganta Srinivasa Rao: రాజీనామా ఆమోదంపై గంటా శ్రీనివాసరావు స్పందన.. జగన్‌లో భయం, అనుమానం..!

ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగంలోని కొల్లం వాగు వరకు రెండు టన్నెల్స్ తవ్వకం పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టింది. తొలి టన్నెల్ ఏడు డయా మీటర్ల వ్యాసార్ధంతో, రెండో టన్నెల్ 9.2 డయా మీటర్ల వ్యాసార్ధంతో తవ్వాలని ముందుగా నిర్ణయించిన విషయం విదితమే.. ఒక్కో టన్నెల్ పొడవు 18. 82 కిలోమీటర్లు. తొలి టన్నెల్ నుంచి మూడు వేల క్యూసెక్కులు, రెండో టన్నెల్ నుంచి 8500 క్యూసెక్కులు చొప్పున రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా వీటిని రూపొందించారు. 2019లో సీఎం జగన్‌ అధికారాన్ని చేపట్టిన తర్వాత రెండు టన్నెల్స్ పనులు చేపట్టారు.. తొలి టన్నెల్ పనులు చేపట్టిన 13 నెలల కాలంలో మిగిలిన 3. 6 కిలోమీటర్ల తవ్వకాన్ని పూర్తి చేశారు.. ఇక, ఆ తర్వాత రెండో టన్నెల్ పనులు ప్రారంభించి.. ఇవాళ్టికి పూర్తి చేశారు..