NTV Telugu Site icon

AP Government: పలు పథకాల పేర్లను మార్చిన ఏపీ ప్రభుత్వం

Ap Government

Ap Government

AP Government: ఏపీ ప్రభుత్వం పలు పథకాల పేర్లను మార్చింది. విద్యా వ్యవస్థలోని పలు పథకాలకు గత ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగించింది. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఏపీ మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలని పలు పథకాలకు కొత్త పేర్లు పెడుతున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. జగనన్న అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం.. జగనన్న విద్యా కానుక స్థానంలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర.. జగనన్న గోరుముద్ద స్థానంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం.. ‘మన బడి నాడు-నేడు’ స్థానంలో ‘మన బడి-మన భవిష్యత్తు’ పేర్లను ఖరారు చేశారు. స్వేచ్ఛ పథకం స్థానంలో ‘బాలికా రక్ష’.. జగనన్న ఆణిముత్యాలు స్థానంలో అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారం పేర్లను ఖరారు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

Read Also: Tirumala: ఆగస్టులో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే..