NTV Telugu Site icon

AP Govt: వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం

Chandrababu

Chandrababu

AP Govt: ఏపీలో వివిధ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. పౌరసరఫరాల శాఖ, పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరోషన్లల్లో చెరో 15 మంది సభ్యులను నియమించింది. అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో 13 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీటీడీసీలో 10 మంది డైరెక్టర్లు నియామకమయ్యారు. మార్క్ ఫెడ్‌లో ఆరుగురు, ట్రైకార్లో ఐదుగురు సభ్యులు నియామకమయ్యారు. విత్తనాభివృద్ధి సంస్థలో ఇద్దరు, వినియోగదారుల రక్షణ మండలిలో ఒకరిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం విడుదలైన కార్పొరేషన్ల సభ్యుల జాబితాలో జనసేనకు 9, బీజేపీకి 5 పదవులను కేటాయించారు. మిగిలిన కార్పొరేషన్లల్లోనూ సభ్యుల నియామకంపై కసరత్తు కొనసాగుతోంది.

Read Also: Amaravati: రాజధానిలో తొలి భూ కేటాయింపు చేసిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. వివిధ కార్పొరేషన్లకు ఛైర్‌పర్సన్లను నియమించింది.. ఒకేసారి మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు భర్తీ చేసింది.. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి.. పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నామినేటెడ్‌ పోస్టుల్లో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 నామినేటెడ్‌ పోస్టులు దక్కాయి.. అయితే, నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేసింది టీడీపీ.