AP Budget: నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. సభలో ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Budget: ఇవాళ మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. వివిధ శాఖల చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు ప్రభుత్వం పెట్టనుంది. ఏపీలో మరో 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. మూడు నెలల కాలానికి అంటే జూన్ వరకూ ప్రభుత్వం చేయబోయో ఖర్చులకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటల 3 నిమిషాలకు 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఇదిలా ఉండగా సభలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్జేయుకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధ సవరణ) బిల్లు -2024 ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024 (రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్స్ అండ్ పే స్ట్రక్చర్ సవరణ బిల్లు)లను సర్కారు ప్రవేశపెట్టనుంది.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- 7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
- Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! 'బై-బై' సెలబ్రేషన్ వీడియో వైరల్.!
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
బడ్జెట్‌కు ముందు ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఉదయం 8 గంటలకు సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్‌లో జరిగే భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను కేబినెట్ ఆమోదించనుంది. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ.2.86 లక్షల కోట్ల బడ్జెట్‌ను అంచనా వేయగా, ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ కింద 4 నెలలకు రూ.95 వేల కోట్ల నుంచి రూ.96 వేల కోట్ల వరకు బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!