NTV Telugu Site icon

Andhra Pradesh: మందుబాబులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి రూ.99 క్వార్టర్ మద్యం బాటిల్!

Ap Liquor

Ap Liquor

Andhra Pradesh: ఏపీలో రూ.99 క్వార్టర్ మద్యం బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ వెల్లడించారు. సోమవారం నాటికి 20,000 కేసుల మద్యం బాటిళ్లు చేరుకోనున్నాయని ఆయన తెలిపారు. ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం సిద్ధమైందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. మద్యం తయారీ విక్రయాలలో జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన 5 సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ ధరకు మద్యం విక్రయాలు చేసేందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. గురువారం నాటికి పదివేల కేసుల రూ.99 మద్యం మార్కెట్‌కు చేరిందన్నారు.

Read Also: Rain Alert to AP: అక్టోబర్ 22న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి రెయిన్ అలర్ట్

సోమవారం నాటికి రోజువారీ సరఫరా 20వేల కేసులకు చేరుతుందని ఆయన స్పష్టం చేశారు. దశల వారిగా సరఫరా పెరిగి ఈ నెలాఖరు నాటికి 2,40,000 కేసుల మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉంటుందన్నారు. మొత్తంగా కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం ఈ నెలలో అందుబాటులో ఉంటుందని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ పేర్కొన్నారు. వినియోగాన్ని బట్టి తదుపరి నెలలో ఏ మేరకు దిగుమతి చేసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.