Kiran Kumar Reddy: కమలం గూటికి కిరణ్ కుమార్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రాబోయే ఎన్నికల నాటికి బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది. మంచి గ్లామర్ ఉన్న నాయకుడు బీజేపీకి కరువైన వేళ.. ఆపరేషన్ ఆకర్ష్ వైపు బీజేపీ హైకమాండ్ అడుగులు వేస్తోంది. త్వరలో బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా రాజకీయంగా అంతగా యాక్టివ్ గా లేరు కిరణ్ కుమార్ రెడ్డి, తాజాగా బీజేపీ జాతీయ నాయకత్వంతో టచ్ లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కీలక పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతోన్న క్రమంలో ఏపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది.
Read Also: Revanth reddy: కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర.. నేడు కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో..
Also Read
ఏపీ బీజేపీలో ఇమేజ్ ఉన్న లీడర్ లేకపోవడంతో కిరణ్ ను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోన్న బీజేపీ ఆదిశగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. జాతీయ స్థాయిలో పదవి కట్టబెడతామని కిరణ్ కు బీజేపీ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చెయనున్నారు. రాహుల్ గాంధీ ఇటీవల ఏపీ కాంగ్రెస్ పై ఫోకస్ పెంచాలని భావించారు. కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని భావించారు. అయితే, కాంగ్రెస్ లో ఉండేందుకు కిరణ్ కుమార్ రెడ్డి అంత ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి స్తబ్ధుగా ఉన్నారు. ఇటీవల బీజేపీలో కీలక పాత్ర పోషించిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ బీజేపీలో బలమయిన నేత లేరు.
రాబోయే ఎన్నికల నాటికి ఏపీ బీజేపీని బాగా పటిష్టం చేయాలని అమిత్ షా భావిస్తున్నారు. అందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కి డోర్లు తెరిచారు. కిరణ్ కుమార్ రెడ్డి ని ఆకర్షించి, మంచి పదవి ఇవ్వాలని భావించారు. అందులో భాగంగానే బీజేపీ అగ్రనేతల సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. అంతకు ముందు మీడియాతోనూ మాట్లాడే ఛాన్స్ ఉంది. ఏపీ విభజనకు ముందు కిరణ్ సీఎంగా వ్యవహరించారు. చివరి బాల్ వరకూ ఆట ఆడదామని, తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదన్నారు. విభజన అనివార్కం కావడంతో అప్పట్లో సీఎం పోస్ట్‌కి, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన కిరణ్‌కుమార్.. 2014లో ఘోరపరాజయం తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరినా పార్టీ వ్యవహారాలకు అంటీముట్టనట్లుగానే ఉన్నారు. కొన్నేళ్లుగా పూర్తి రాజకీయ అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఇకపై బీజేపీలోకి వెళ్లి జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మరి, నల్లారి వారి సేవలను బీజేపీ నేతలు ఎలా వాడుకుంటారో చూడాలి.
Read Also: Liquor Policy Case: ఆ ముగ్గురినీ కలిపి ప్రశ్నించే అవకాశం?
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!