Site icon NTV Telugu

AP Elections 2024: టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు!

Rayachoti Police

Rayachoti Police

TDP Leaders House Arrest in Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ నేతల ఇండ్లపై జరిగిన దాడులపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. చిన్నమండెం మండలం పడమటికోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలో రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Also Read: Palnadu: తేరుకుంటున్న పల్నాడు.. తెరుచుకుంటున్న చిరు వ్యాపారాలు!

వైసీపీ నేత వండాడి వెంకటేశ్వర్లు ఇంటివద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాత్రి జరిగిన ఘటన నేపథ్యంలో టీడీపీ, వైసీపీ పార్టీ కార్యాలయాల వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించి ఉన్నాయి. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. పోలీసుల వలయంలో రాయచోటి ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అసవరం అయితే 144 సెక్షన్ విధిస్తామని తెలిపారు.

Exit mobile version