NTV Telugu Site icon

AP Elections 2024: ఆధిక్యంలో పవన్‌ కల్యాణ్‌.. ఎన్ని ఓట్లు లీడ్‌లో ఉన్నారంటే?

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan in Lead in Pithapuram against Vanga Geetha: ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ మొదలైంది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏపీలో కూటమి అభ్యర్థుల ఆధిక్యం కొనసాగుతోంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆయన 4300 లీడ్‌లో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేసిన విషయం తెలిసిందే.

మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ముందంజలో ఉన్నారు. పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ కలికిరి మురళీ మోహన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ముందంజలో కొనసాగుతున్నారు. హిందూపురంలో బాలకృష్ణ ముందంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థులు రోజా, కొడాలి నాని వెనకంజలో ఉన్నారు.