గత కొద్దిరోజుల నుంచి దేశంలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి మొదలైంది. అన్ని పార్టీలు ఆయా రాష్ట్రలలో ఉన్న రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికే పెద్ద ఎత్తున రాజకీయ బహిరంగ సభలను ఏర్పాటు చేసి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఓ కీలక విషయాన్ని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఏ తేదీన విడుదల చేస్తామన్న విషయాన్ని తెలిపారు.
Also read: Whatsapp Update: వాట్సాప్‌లో రాబోతున్న సరికొత్త కొత్త ఫీచర్.. ఇక వాటికోసం కూడా..!
ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 2024 నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ తెలిపారు. దీంతోపాటుగా నామినేషన్ ప్రక్రియ తేదీలు, అలాగే వాటి ఉపసంహరణ సంబంధించిన తేదీలను కూడా ఆయన తెలిపారు.
Also read: Catherine Tresa: బ్లాక్ డ్రెస్సులో స్టన్నింగ్ లుక్ లో కేథరిన్ హాట్ ట్రీట్..
ఇక సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 18 నుండి ఏప్రిల్ 25 వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరిస్తామని., అలాగే ఏప్రిల్ 26న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ముగుస్తుందని ఏపీ ఎన్నికల సంఘం మీనా తెలిపారు. ఆపై ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే ఎన్నికలు మే 13న జరగనున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తాము అన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
