NTV Telugu Site icon

AP ECET Results: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే..

Ap Ecet

Ap Ecet

AP ECET Results: ఏపీ ఈసెట్-2023 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి కాకినాడలోని జేఎన్‌టీయూలో విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 20న జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 38,181మంది దరఖాస్తు చేసుకోగా 34,503మంది హాజరయ్యారు. వీరిలో 25,902మంది బాలురు కాగా.. 8601మంది బాలికలు ఉన్నారు.

Also Read: Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుతో పాటు హెచ్ఆర్ఏ పెంపుకు ఛాన్స్..!

రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష రాసిన 34,503 విద్యార్థుల్లో 31,933 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారని అధికారులు తెలిపారు. క్వాలిఫై అయిన వారిలో 23,748 మంది బాలురు, 8185 బాలికలు అర్హత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తీర్ణత శాతం 92.55గా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే పాస్ పర్సంటేజ్ తగ్గినట్లు అధికారులు తెలిపారు. పాలిటెక్నిక్ , బీఎస్సీ(గణితం) పాసైన విద్యార్థులకు ఈసెట్‌లో ర్యాంకుల ఆధారంగా బీఈ, బీటెక్, బీఫార్మసీ సెకండియర్ నేరుగా ప్రవేశం పొందుతారు.

ఫలితాల కోసం.. క్లిక్ చేయండి