EAPCET Results: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్–2023 ఫలితాలను బుధవారం ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఫలితాలను విజయవాడలో మంత్రి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్‌లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. అగ్రికల్చర్‌లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్‌లో మొత్తం 2,24,724 మందికి గానూ 1,71,514 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్‌లో 90,573 మందికి గానూ, 81,203 మంది అభ్యర్థులు క్వాలిపై అయ్యారు.
Also Read: IT Raids In Hyderabad: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు
మే 15 నుంచి 19 వరకు జరిగిన ఇంజినీరింగ్ స్ట్రీమింగ్ పరీక్షకు 2.24 లక్షల మంది హాజరవగా.. అదే నెల 22, 23 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీం పరీక్షకు 90,573 మంది హాజరయ్యారు. ఇక ఇంజినీరింగ్ ప్రవేశాలకు 2,37,193 మంది విద్యార్ధులు.. అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశాలకు 99, 557 మంది దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. కోవిడ్ సమయంలో తొలగించిన ఇంటర్మీడియెట్ వెయిటేజ్ మార్కులను ఈసారి పరిగణలోకి తీసుకుని ఫలితాలను ప్రకటించారు.
ఫలితాల కోసం.. క్లిక్ చేయండి