Site icon NTV Telugu

AP DSC: ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా.. కారణం ఏంటంటే?

Ap Dsc

Ap Dsc

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. జూన్ 06 నుంచి 30వ తేదీ వరకు DSC పరీక్షలు కొనసాగుతాయి. అయితే పరీక్షలు రాస్తున్న టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీనికి గల కారణం ఏంటంటే.. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షలను వచ్చే నెల 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పులు చేస్తూమెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి.కృష్ణారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

Exit mobile version