Site icon NTV Telugu

Dy Cm Rajanna Dora: ఏపీలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టం

R Dora

R Dora

తెలంగాణలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ ఎస్ పార్టీగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై రాజకీయ పార్టీల నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. తోటి తెలుగు రాష్ట్రం ఏపీలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం రాజన్నదొర విజయనగరంలో దీనిపై స్పందించారు. జాతీయస్థాయిలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు పై స్పందించిన రాజన్నదొర.. భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు…అదే విధంగా కేసీఆర్ కుడా జాతీయస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పెట్టి వుంటారన్నారు.

Read Also: Ramya Krishnan: నాలుగు నెలల కడుపుతో ఉన్నా ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేశా

దీనివల్ల వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. అంధ్రలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టం అన్నారు రాజన్న దొర. ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయినప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలంటేనే కేసిఆర్ ఒప్పుకోలేదు. అలాంటిది ఆంధ్రాలో వచ్చి కేసిఆర్ పెత్తనం చేస్తానంటే మనం ఎలా ఒప్పుకుంటాం. మనుగడ సాగించలేని కొన్ని రాజకీయ పార్టీలు కేసిఆర్ పార్టీలో చేరొచ్చు గాని వైస్సార్ లో వాళ్లు వేళ్లేదే లేదు.. అలాగే టిడిపి పార్టీలో కొందరు అవకాశాలు లేక నిరాశ, నిసృహత ఉన్నవారు కేసిఆర్ పంచన చేరవచ్చు అన్నారు.

Read Also: Asaduddin Owaisi: ముస్లింలలో సంతానోత్పత్తి రేటు క్షీణించింది.. జనాభా నియంత్రణ అవసరం లేదు.

వైఎస్సార్ పార్టీ పటిష్టంగా ఉంది 175 సీట్లు కి 151 తెచ్చుకుని ప్రజా రంజకపాలన చేస్తుంది…ఉత్తరాంధ్రలో తమ వెలమ సామాజిక వర్గానికి చెందిన కొంతమందిని పార్టీలోకి తీసుకునే ఆలోచన ఉన్నట్టు కనిపిస్తుంది. వైస్సార్ పార్టీ నుండి ఎవరు బీఆర్ ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా లేరన్నారు. మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఏ పార్టీ పోటీ కాదన్నారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణమైన కేసీఆర్ ను ఏపీలో ఆదరించే పరిస్థితి లేదు..టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలే కాదు ఎన్ని పార్టీలు వస్తే వాళ్ళే అంత పలచన అవుతారు.. ఇక్కడ ఎన్ని పార్టీలు వచ్చినా వైసీపీకి పోటీ వుండదు..మరో25 ఏళ్లు వైఎస్ జగన్ ఏపీకి సీఎంగా వుంటారని ధీమా వ్యక్తం చేశారు..

Exit mobile version