Deputy CM Peedika Rajanna Dora: అన్ని వర్గాల అవసరాలను తీర్చే పాలనను ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర పేర్కొన్నారు. వైఎస్సార్ కంటే రెండడుగులు ముందుకు వేసి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆయన అన్నారు. ఎలాంటి సిఫారసు లేకుండా అర్హులందరికీ వారి ఖాతాల్లో నేరుగా లబ్ధిని అందిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. గిరిజనులకు గతంలో ఎవరు చేయని సామాజిక న్యాయాన్ని జగన్ అందిస్తున్నారని.. గత టీడీపి ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వలేదని.. జగన్ ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవినే ఇచ్చారన్నారు. నాటి పాలనను.. నేటి పాలనను పోల్చి చూసుకోవాలన్నారు.
Read Also: Minister Amarnath: వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుపై మంత్రి అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
జీసీసీ, ట్రై కార్ సంస్థలకు ఛైర్మన్‌లను జగన్ నియమించారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. గతంలో కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశారన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గిరిజనులకు 40 వేల ఎకరాల భూమిని మాత్రమే ఇచ్చారని.. కానీ జగన్ హయాంలో మూడు లక్షల ఎకరాలకు పైగా భూములను 2 లక్షల మంది గిరిజనులకు ఇచ్చారని చెప్పారు. గిరిజనుల కోసం ప్రత్యేకమైన పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు. గిరిజనుల కోసం ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకువచ్చారని.. ఈ విద్యను కూడా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. పోడు భూములకు కూడా రైతు భరోసాను ముఖ్యమంత్రి ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. వచ్చే నెల నుంచి 3 వేల రూపాయల మేర పెన్షన్ ఇస్తున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు. 25 లక్షల రూపాయల మేర వైయస్సార్ ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేయించుకునే వీలు కల్పించారన్నారు.
Read Also: MLC Vamshikrishna: వైఎస్సార్సీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్?
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర మాట్లాడుతూ..”తాము అధికారంలోకి వస్తే పసుల పథకాలు రద్దు చేస్తామని చంద్రబాబు చెప్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నో హామీలను ఇచ్చి వాటిని విస్మరించారు. గిరిజనులకు మేలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పి అన్నింటినీ విస్మరించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి దగా చేశారు. అన్నింటిలో చంద్రబాబు మోసం చేశారు.. ఆయనకు పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారు. ఎస్టీ కమిషన్‌కు ఛైర్మన్‌ను కూడా వేయలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నియమించారు.” అని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర వ్యాఖ్యానించారు.