Site icon NTV Telugu

Pawan Kalyan: రోహింగ్యాలు, స్లీపర్‌ సెల్స్‌పై దృష్టి పెట్టండి!

Pawan Kalyan

Pawan Kalyan

రోహింగ్యాలు, స్లీపర్‌ సెల్స్‌పై దృష్టి పెట్టండని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమన్నారు. దేశ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని.. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌), డీజీపీకి ఆయన లేఖ రాశారు.

‘రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరం. తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్‌పై దృష్టి పెట్టాలి. దేశ భద్రత, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలి’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖలో పేర్కొన్నారు.

Exit mobile version