78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎగురవేశారు. ఈ వేడుకలకు పవన్ తన కూతురు ఆద్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజ్ పైన డిప్యూటీ సీఎం తన కుమార్తెతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోని చూసిన పవన్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఈ ఫోటోకి నెట్టింట పెద్ద ఎత్తున షేర్లు, లైక్స్, కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
Also Read: IPL 2025-MI Captain: హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్!
పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ కుమార్తె ఆద్య. పవన్, రేణుల విడాకుల అనంతరం తల్లితో కలిసి ఆద్య ఉంటున్నారు. ఖాళీ దొరికినప్పుడల్లా తండ్రి పవన్ వద్దకు ఆమె వస్తుంటారు. పవన్‌కు కుమార్తె ఆద్య అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అలానే కుమారుడు అకీరా నందన్ కూడా. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో పవన్ పక్కనే అకీరా ఉన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ తాను చేయాల్సిన మూడు సినిమాలను పక్కన పెట్టి.. పూర్తిగా ఏపీ ప్రజల కోసం శ్రమిస్తున్నారు. పవర్ స్టార్ త్వరలోనే సెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.