Pawan Kalyan: పవన్ గొప్ప మనసు.. జీతభత్యాల నుంచి అనాధ విద్యార్థులకు ఆర్థిక సాయం

  • జీతభత్యాల నుంచి అనాధ విద్యార్థులకు ఆర్థిక సాయం
  • 42 మందికి అయిదువేల రూపాయల చొప్పున చెక్కులను అందజేయనున్నారు
Pawan Kalyan Speech

Pawan Kalyan Speech

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. అనాధ విద్యార్థినీ విద్యార్థులకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సహాయం అందించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ తనకు అందుతున్న జీతభత్యాల నుంచి పిఠాపురంలో అనాధ విద్యార్థిని విద్యార్థులకు ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఈ నెల కూడా చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం అందచేయడానికి ఏర్పాట్లు చేయవలసిందిగా కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 42 మందికి అయిదువేల రూపాయల చొప్పున చెక్కులను అందజేయనున్నారు. ఈ చెక్కులను జనసేన క్రియాశీలక కార్యకర్తలు బుధవారం పిఠాపురంలో పంపిణీ చేయనున్నారు.