Site icon NTV Telugu

Pawan Kalyan: సెలూన్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌!

Pawan Kalyan

Pawan Kalyan

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో సెలూన్ షాప్ ఓపెనింగ్‌లో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ‘సెలూన్ కొనికి’ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పవన్‌తో పాటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Also Read: Breakup Tips: బ్రేకప్ నుంచి బయటపడాలంటే.. ఈ టిప్స్ పాటించండి..

సెలూన్ కొనికి ప్రారంభోత్సవం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అభిమానులకు హాయ్ చెప్పారు. కారు ఎక్కుతున్న సమయంలో అభిమానులకు హాయ్ చెప్పి.. నమస్కరించారు. దాంతో ఫాన్స్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ అంటూ అరిచారు. కొందరు ఫొటోస్, వీడియోస్ తీసుకున్నారు. అయితే సెలూన్ ప్రారంభోత్సవంకు పవన్ చాలా సింపుల్‌గా టీషర్ట్, షార్ట్ వేసుకుని వచ్చారు. ఇందుకు సంబందించిన పిక్స్ఎం వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్యన ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమా షూటింగ్‌తో పవన్ బిజీగా ఉంటున్నారు.

Exit mobile version