Site icon NTV Telugu

Pawan Kalyan: పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం దురదృష్టకరం

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: పశ్చిమబెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ స్పందించారు. పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయిగురి ప్రాంతంలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసిందన్నారు. కాంచనజంగ రైలును గూడ్స్ ఢీకొట్టిన ఈ ప్రమాదంలో 15 మంది మరణించడం దురదృష్టకరమని వాపోయారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రైల్వే మంత్రిత్వ శాఖను పవన్ కల్యాణ్ కోరారు. ప్రమాదాల నివారణకు ఉద్ధేశించిన కవచ్ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాలకి తావు లేని ప్రయాణాన్ని ప్రజలకు అందించాలన్నారు.

Read Also: Rammohan Naidu: భోగాపురం ఎయిర్‌పోర్టును రికార్డ్ స్థాయిలో పూర్తి చేస్తాం‌..

Exit mobile version