Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బెంగళూరులో పర్యటించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అనంతరం కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. కుంకీ ఏనుగుల ఒప్పందం, పలు అంశాలపై చర్చించేందుకు బెంగళూరుకు పవన్ వెళ్లారు. ఈ క్రమంలోనే ఏనుగుల దాడులపై పరిష్కారం కోసం పవన్ చర్చలు జరిపారు. కర్ణాటక నుంచి 6 కుంకీ ఏనుగులు ఏపీకి ఇచ్చే అంశంపై పవన్ చర్చించినట్లు తెలిసింది. పొలాల మీద పడే ఏనుగుల్ని తరమడానికి కుంకీ ఏనుగులతో పరిష్కారం లభిస్తుందని గతంలో అధికారులు చెప్పగా.. ఈ మేరకు చర్చలు జరిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లు సమాచారం. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్ర చందనం దోపిడీని అరికట్టేలా పవన్ ప్రణాళికలు చేపట్టనున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడి కలిసి పని చేయాలని కర్ణాటక అటవీ శాఖ మంత్రిని కోరారు.
Read Also: Ganja Gang Arrest: తీగ లాగితే కదిలిన డొంక.. గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్