Site icon NTV Telugu

Pawan Kalyan New Look: డిఫరెంట్ లుక్‌లో డిప్యూటీ సీఎం.. పిక్స్ వైరల్!

Pawan Kalyan New Look

Pawan Kalyan New Look

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారి డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వైట్ కుర్తా ఫైజామాలోనే పవన్ ఎక్కువగా కనిపించారు. చాలా రోజులు తర్వాత ఈరోజు రాజమహేంద్రవరంలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్‌ శంకుస్థాపనకు షర్ట్, ఫ్యాంట్‌ వేసుకొచ్చారు. షర్ట్, ఫ్యాంట్‌తో టక్ చేసుకొచ్చిన పవన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: Akhanda Godavari Project: ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన!

ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించి సందడి చేసిన విషయం తెలిసిందే. విజయవాడలోని పెనమలూరు మండలంలో ‘కొనిక’ సెలూన్‌ను పవన్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి సాదాసీదాగా ఓ టీషర్ట్, షార్ట్ ధరించారు. ఆ సమయంలో పవన్ హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. కొనిక సెలూన్‌ ఓనర్ పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు కాబట్టే.. ప్రత్యేకంగా ప్రారంభోత్సవానికి వెళ్లారు. అప్పటి హెయిర్ స్టైలే ప్రస్తుతం ఆయన మైంటైన్ చేస్టున్నారు. మొత్తానికి డిఫరెంట్ లుక్‌లో ఉన్న డిప్యూటీ సీఎంను చూసి ఫాన్స్ సంబరపడిపోతున్నారు.

Exit mobile version