NTV Telugu Site icon

Pawan Kalyan: పిఠాపురంలో స్థలం కొన్న పవన్‌ కల్యాణ్‌.. ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan Plans House in Pithapuram: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం (జూన్ 3) స్థలం కొని.. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలను కొన్నారు. బుధవారం మధ్యాహ్నం పవన్‌ పేరున రిజిస్ట్రేషన్‌ పూర్తయింది.

రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని.. పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని పవన్‌ కల్యాణ్‌ నిన్న జరిగిన భారీ బహిరంగ సభలో చెప్పారు. పిఠాపురంలో ఎకరం మార్కెట్‌ విలువ రూ.15-17 లక్షల మేర ఉంది. మరో పదెకరాల భూమిని కొనేందుకు జనసేన నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్‌ భారీ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

Show comments